హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ దినోత్సవం.. మాక్ అసెంబ్లీ

VKB: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని పీఎం శ్రీ నంబర్ వన్ పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు మహేశ్, దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధికార, ప్రతిపక్షాలుగా విడిపోయి సభను ఆసక్తికరంగా నిర్వహించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, PRC, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి తమ ప్రతిభను చాటుకున్నారు.