హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడంగల్ అభివృద్ధికి కొత్త అడుగు

VKB: కొడంగల్ పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. అంబేద్కర్ చౌరస్తా విస్తరణతో పాటు ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతులు అందనున్నాయి. పట్టణ రూపురేఖలు కూడా మారనున్నాయి.