హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తికి గాయాలు

RR: షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.