SRCL: ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను ఎంపీడీవో సత్తయ్య గురువారం పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్రోల్మెంట్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
జీవిత బీమా నమోదు పరిశీలించిన ఎంపీడీవో


