హైదరాబాద్: 28°C
తెలంగాణ

సఫాయిలకు నూతన వస్త్రాల పంపిణీ

MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ కాకులమర్రి శ్రీలత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ విలువలు, అంబేద్కర్ సేవలను వివరించారు. అనంతరం గ్రామ పారిశుధ్య కార్మికులు, సిబ్బందిని అభినందించి నూతన వస్త్రాలు పంపిణీచేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎల్లయ్య తదితరులున్నారు.