రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. గురువారం నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అనుమానిత ప్రాంతాలపై నిఘా పెంచాలని సూచించారు. వ్యసన బాధితులకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించాలన్నారు.
తెలంగాణ
'డ్రగ్స్ వినియోగం,అక్రమ రవాణా కట్టడికి చర్యలు'


