SRPT: సూర్యాపేట నుంచి నకిరేకల్, నల్గొండ మీదుగా దేవరకొండకు శుక్రవారం నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ వి. సునీత తెలిపారు. సూర్యాపేట నుంచి ఉదయం 5:40, 7:40 మ. 2:00, సాయంత్రం 4:00 గంటలకు, తిరుగు ప్రయాణంలో దేవరకొండ నుంచి 8:30, 11:00, 5:20, 7:20 గంటలకు సర్వీసులు ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'దేవరకొండకు ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ సర్వీసులు


