హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో మేక మృతి

VKB: మైల్వారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షాక్ తగిలి మేక మృతి చెందింది. మేత కోసం ట్రాన్స్‌ఫార్మర్ సమీపానికి వెళ్లిన మేక ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో యజమాని బల్లెం ఉస్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.