హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ డివిజన్ కార్యదర్శిగా నవకాంత్

HYD: చిలకలగూడ డివిజన్ బీజేపీ కార్యదర్శిగా నవకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన జిల్లా మీడియా కన్వీనర్ అజయ్‌కు నవకాంత్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.