హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సిలువగుట్టపై మట్టి తవ్వకాలు నిలిపివేయాలి'

MNCL: లక్షెట్టిపేటలోని సిలువగుట్ట అక్రమ తవ్వకాన్ని వెంటనే నిలిపివేయాలని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతి లేకుండా గుట్టను ధ్వంసం చేస్తూ మట్టి తరలిస్తున్నారని తెలిపారు. దీంతో సమీపంలోని గురుకులాలు, డిగ్రీ కళాశాల, హాస్టళ్లలో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు.