హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవాలాల్ విగ్రహానికి సీఎం భూమి పూజ

NGKL: పదర మండలంలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో 37 కోట్లతో ఏర్పాటు చేయనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి CM రేవంత్ రెడ్డి గురువారం భూమి పూజ నిర్వహించారు. లంబాడీల ఆత్మగౌరవానికి సేవాలాల్ విగ్రహం నిదర్శనంగా ఉంటుందన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, MP రవి, MLA డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.