హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఏఎంసీ ఛైర్మన్

JGL: కథలాపూర్ మండలంలోని బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఏఎంసీ ఛైర్మన్ నారాయణరెడ్డి ప్రారంభించి, రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. వైస్ ఛైర్‌పర్సన్ శిరీష, సర్పంచులు సుధాకర్, రాజగంగారాం పాల్గొన్నారు.