RR: సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ ఫ్లైఓవర్‌పై గురువారం మధ్యాహ్నం వరుస రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆయిల్ ఒలికి జారుడుగా మారడంతో ఆరు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వాహనదారులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఒకదానికొకటి ఢీకొన్న ఆరు బైక్‌లు


