హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారం బావిని సందర్శించిన కలెక్టర్

నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్డులో ఉన్న భారం బావిని గురువారం కలెక్టర్ సందర్శించారు. బావి వద్ద రాత్రివేళల్లో వెలుతురు కోసం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీ స్థలంలో చిన్నారుల కోసం ఉయ్యాలలు, జారుబండలు తదితర ప్లే కిట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అంచనాలు రూపొందించి వెంటనే పనులు చేపట్టాలని సూచించారు.