హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనాలు తనిఖీ నిర్వహించిన ఎస్సై

WGL: నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్‌లో ఎస్సై జి. రామకృష్ణ చారి వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులను ఆయన సూచించారు.