హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెండి పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణం: మాజీ ఎమ్మెల్యే

NLG: చింతపల్లి మండలం చాకలిశేరిపల్లికి చెందిన ఆకుల అక్షిత అంతర్జాతీయ స్థాయిలో వెండి పతకం సాధించడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శ్రీలంక దేశంలో నిర్వహించిన రెండవ సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్-2026లో ద్వితీయ బహుమతిగా వెండి పతకం సాధించిన ఆకుల అక్షితను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.