హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీ కారిడార్‌లో వన్‌వే విధానం: డీజీపీ

HYD: సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు త్వరలో వన్‌వే విధానంతో పాటు ప్రత్యేక బస్ లేన్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఐటీ కారిడార్‌లోని 10 లక్షల మంది ఉద్యోగుల్లో 80 శాతం మంది సొంత వాహనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రజల సహకారంతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.