హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ ఐడీఓసీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

KNR: కరీంనగర్ ఐడీఓసీలో గురువారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు రాజ్యాంగ ప్రవేశికను చదివి ప్రతిజ్ఞ చేశారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ఆచరిస్తూ విధులు, బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.