హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగర్‌కు ఇన్‌ఫ్లో కంటే ఔట్‌ఫ్లో అధికం

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5,663 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్‌ఫ్లో 11,873 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టులోకి వస్తున్న నీటి కంటే విడుదలవుతున్న నీరే అధికంగా ఉంది. ఏపీకి కుడి కాలువ ద్వారా 8 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా 1 టీఎంసీ నీరు విడుదల చేయడంతో జలవివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.