హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమాకు డిసెంబర్ 18 డెడ్‌లైన్

RR: రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా అందించే ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో అర్హులంతా పేర్లు నమోదు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ ఎంపీడీఓ శ్రీరామ్ సూచించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న 18 నుంచి 59 ఏళ్ల వయసు గల స్త్రీ లేదా పురుషుల్లో ఒకరు తప్పనిసరిగా డిసెంబర్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.