VKB: నవాబుపేట మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపారి ప్రభాకర్ సహకారంతో వృద్ధులు, పెన్షన్‌దారులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. నవాబుపేట, ఏత్రాజ్‌పల్లి గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి సర్పంచులు నరసింహారెడ్డి, జగన్ రెడ్డి సమక్షంలో మండల నాయకులు దుప్పట్లు అందజేశారు. చలికాలంలో వృద్ధులకు అండగా నిలిచేలా ఈ సేవా కార్యక్రమం చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
వృద్ధులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ


