హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ వుషు పోటీలకు గోపిక

NGKL: లింగాల జెడ్పీహెచ్‌ఎస్ 9వ తరగతి విద్యార్థిని కే. గోపిక పౌర్ణమి జాతీయ స్థాయి వుషు పోటీలకు ఎంపికైంది. ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను గురువారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోచ్ నాగరాజ్, ఎంఈవో బషీర్ అహ్మద్, భాషమోని కొండయ్య ఉన్నారు.