హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

RR: మంత్రి శ్రీధర్ బాబు ఫరూక్‌నగర్ మండల పర్యటన నేపథ్యంలో సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. సభా వేదిక, ప్రాంగణం, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలను పరిశీలించి నాయకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.