BHNG: రాజ్యాంగ దినోత్సవాన భువనగిరి బొమ్మాయిపల్లిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు, వివిధ చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత ప్రతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
తెలంగాణ
రాజ్యాంగ హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు


