NZB: ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యంత విశిష్టమైనదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నగరంలోని పులాంగ్ చౌరస్తాలో భారతీయ సంవిధాన్ ప్రచార దళ్ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే విశిష్టమైనది: ఎమ్మెల్యే ధన్పాల్


