హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆమ్ ఆద్మీ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం

NLG: ఆమ్ ఆద్మీ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నల్లగొండలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2012లో స్థాపించిన పార్టీ 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అన్సారీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దంకి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు యూసుఫ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.