SRPT: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈరోజు కోదాడ పట్టణంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణ
'రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'


