హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో 35 బాల్య వివాహాలకు అడ్డుకట్ట

WNP: జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 35 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గోపాల్‌పేట మండలం బుద్ధారం గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగాలని సూచించారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే 1098కు ఫోన్ చేయాలని కోరారు.