హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంవిధాన్ రక్షక్ ర్యాలీలో పాల్గొన్న ఆడే గజేందర్

ADB: AICC పిలుపు మేరకు TPCC ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన 'సంవిధాన్ రక్షక్ ర్యాలీ'లో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజేందర్ పాల్గొన్నారు. లిబర్టీ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగిన పాదయాత్రలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాజు యాదవ్, మహేందర్ ఉన్నారు.