హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు చిరుధాన్యాల ప్రాసెసింగ్‌పై శిక్షణ

సంగారెడ్డి జిల్లా కంది వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో చిరుధాన్యాల ప్రాసెసింగ్, నిల్వపై రైతులకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. PJTAU, ICAR–IIMR హైదరాబాద్ సంయుక్తంగా నాలుగు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పంట కోత అనంతర నిర్వహణ, శుభ్రపరచడం, నిల్వ, పొట్టు తొలగింపు, గ్రేడింగ్, మిల్లింగ్ విధానాలను అధికారులు వారికి వివరించారు.