హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా పోటీల ఏర్పట్లపై కలెక్టర్ సమీక్ష

మహబూబ్‌నగర్‌లో జరగనున్న ఖేలో ఇండియా జాతీయ కబడ్డీ పోటీల ఏర్పాట్లపై కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులతో  గురువారం సమీక్షించారు. ఈ పోటీలు డిసెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్నట్లు తెలిపారు. వసతి, రవాణా, స్టేడియం సౌకర్యాలు, వైద్యం, భద్రత, పారిశుద్ధ్యం, ప్రచార ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోటీలను విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు.