హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దివ్యాంగులకు ఉపకరణాల ఎంపిక శిబిరం

హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు గురువారం సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం నిర్వహించారు. శిబిరానికి 700 మందికి పైగా హాజరయ్యారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉపకరణాలను గుర్తించారు. అర్హులకు త్వరలోనే సామగ్రిని అందించనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ దండి లక్ష్మి తెలిపారు.