SRCL: తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు. 561 కుటుంబాలకు గాను 277 కుటుంబాల వివరాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అర్హులందరూ రేషన్ కార్డు, ఫోన్, నామినీ వివరాలు అందించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
జీవిత బీమా నమోదు శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్


