హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కరపత్రం ఆవిష్కరణ

MBNR: పాలమూరు యూనివర్సిటీ ఐపీఆర్ సెల్, గోవా మేధో సంపత్తి హక్కుల నైపుణ్య కేంద్రం సంయుక్తంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు మేధో సంపత్తి హక్కులపై అవగాహన అవసరమని వీసీ పేర్కొన్నారు.