HYD: మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి కొత్త పేరు ఖరారైంది. ఇకపై ఈ విభాగం 'తెలంగాణ రుద్రమ సేన'గా కొనసాగనుంది. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మహిళలకు రాజకీయ, సామాజిక రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించడంతో పాటు వారి హక్కుల పరిరక్షణకు రుద్రమ సేన కృషి చేస్తుందని ఆమె వెల్లడించారు.
తెలంగాణ
ఇకపై తెలంగాణ రుద్రమ సేన: కవిత


