SRD: రాయికోడ్ మండలం శంశోద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన యాదయ్య జహీరబాద్‌లో ఆటోలో వెళ్తుండగా రూ.31,240 ఉన్న బ్యాగ్ మర్చిపోయి గంగ్వార్‌లో దిగాడు. దీంతో హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేశారు. SI రవికుమార్ విచారణ చేపట్టి 30 నిమిషాల వ్యవధిలోనే బాధితుడికి బ్యాగును తిరిగి అందజేశారు. దీంతో సదరు పోలీసు బృందాన్ని స్థానికులు అభినందించారు.
తెలంగాణ
పొగొట్టుకున్న నగదు బ్యాగు అప్పగింత


