హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి'

NRML: గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ సాగు, విక్రయం,రవాణా,నిల్వ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు.గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగు లేదా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలన్నారు.