హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల అద్దె గదులపై బహిరంగ టెండర్లు వేయాలి: MRPS

ADB: ఇచ్చోడ జెడ్పీ పాఠశాలకు చెందిన 24 అద్దె గదులకు 2016 నుంచి టెండర్లు నిర్వహించకుండా పాతవారినే కొనసాగించడంపై MRPS నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హెచ్‌ఎంకు వినతిపత్రం అందజేసి, వెంటనే టెండర్లు వేసి పదేళ్ల అద్దె వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 930 మంది విద్యార్థుల అభివృద్ధికి ఆదాయం అందాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.