హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పిపోయిన చిన్నారులు సేఫ్..

HYD: అంబర్‌నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన ఇద్దరు చిన్నారులను వారసిగూడ పోలీసులు గంట వ్యవధిలోనే గుర్తించారు. పిల్లలు కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే గాలింపు చేపట్టారు. పెట్రోలింగ్, బీట్ సిబ్బంది, కంట్రోల్ రూమ్ సమన్వయంతో చిన్నారుల ఆచూకీ తెలుసుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.