MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మేయర్ మధుకర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు.
తెలంగాణ
'జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి'


