నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రామ్ నాయక్ తండాలో చెక్ డ్యామ్ నిర్మాణానికి ఏపీవో హరిలాల్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్ డ్యామ్ల నిర్మాణంతో వర్షపు నీరు వృథాగా ప్రవహించకుండా నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుందని, తద్వారా భూగర్భ జలమట్టం పెరిగి బావులు, బోర్లలో నీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు.
తెలంగాణ
చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఏపీవో హరిలాల్


