VKB: అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభస్వామి జాతర భక్తుల కోలాహలం మధ్య వైభవంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా ఈరోజు స్వామివారు ముత్యాల పందిరి సేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో అనంతగిరి కొండలు మార్మోగాయి.
తెలంగాణ
ముత్యాల పందిరిపై స్వామివారి ఊరేగింపు


