హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంట మార్కెట్లో నిలకడగా పత్తి ధరలు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పత్తి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గురువారం 140 వాహనాల్లో రైతులు 1,166 క్వింటాళ్ల విడి పత్తిని విక్రయానికి తీసుకొచ్చారు. క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.9,150, కనిష్ఠ ధర రూ.8,850, మోడల్ ధర రూ.9,050 నమోదైనట్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు.