హైదరాబాద్: 28°C
తెలంగాణ

తంగళ్ళపల్లిలో వికసిత్ భారత్ యువ సంవాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో మై భారత్ ఆధ్వర్యంలో 'వికసిత్ భారత్ యువ సంవాద్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ ఐకాన్ శ్రీనిత్య, స్పోర్ట్స్ ఐకాన్ ప్రశాంత్ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. నషా ముక్త్ భారత్, వికసిత్ భారత్ @2047పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు రాజ్యాంగ ప్రవేశిక పఠించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. జైనా హాజరయ్యారు.