హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం

NRML: మామడ మండలంలోని తండ్రా గ్రామపంచాయతీ పరిధిలో గల దన్జీ నాయక్ తండ శివారులో కూన్సోత్ రవి అనే వ్యక్తి అక్రమ గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 258 గంజాయి మొక్కలను 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.