NLG: నవంబర్ 22 వరకు నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ 47.177 టీఎంసీలు, ఏపీ 17.207 టీఎంసీలు వాడినట్లు కేఆర్ఎంబీ కమిటీ ప్రకటించింది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు తెలంగాణ 21, ఏపీ 19 టీఎంసీలను కోరాయి. డెల్టాకు విడుదలపై మూడు సభ్యుల కమిటీలో ఏకాభిప్రాయం కుదరక, అంశం పూర్తి బోర్డు సమావేశానికే వెళ్లనుంది. హైదరాబాద్ నగర తాగునీటికి 15 టీఎంసీలు ఉంచాలని తెలంగాణ కోరింది.
తెలంగాణ
సాగర్ నీటి వాడకంలో తెలంగాణ ముందు


