RR: BKMU జాతీయ సమితి పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్లో డీఆర్వోకు వినతిపత్రం అందించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కూలీలకు రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
'ఏడాదికి 200 రోజుల పని కల్పించాలి'


