హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి భద్రతపై వినూత్న ఆలోచనలు

RR: టీ-హబ్‌లో నిర్వహించిన ‘సైబరాబాద్ మూవ్స్–2026’ కార్యక్రమాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ రమేష్, ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. విద్యార్థులు, రవాణా రంగ నిపుణులు రహదారి భద్రత, మెరుగైన రవాణా సదుపాయాలు, పర్యావరణహిత ప్రయాణ వ్యవస్థలపై తమ వినూత్న ఆలోచనలను పంచుకున్నారు. భవిష్యత్తు రవాణా అవసరాలపై చర్చించారు.