హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోలేటిలో చేయూత పెన్షన్లు పంపిణీ

ASF: గోలేటి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్లను సర్పంచ్ బాబురావు, ఉపసర్పంచ్ తిరుపతిలు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.