హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి.. ఘనంగా సామూహిక వ్రతాలు

KNR: నగరంలోని 13వ డివిజన్ మార్కండేయ నగర్‌లో భద్రావతి సమేత భావనా ఋషి స్వామి మందిరంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం నూతన కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేశారు. వేదపండితులు సంపత్ శర్మ 12 జతల దంపతులతో సంప్రదాయబద్ధంగా పూజలు చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.